పొలిటికల్ జేఏసీ తాలూకా అధ్యక్షుడు నాగరాజును సన్మానించిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఎర్రవల్లి. మండల కేంద్రం బీచుపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ యువ నాయకుడు బీచుపల్లి తెలుగు నాగరాజుకు పొలిటికల్ జేఏసీ తాలూకా అధ్యక్ష పదవి వచ్చిన శుభ సందర్భంగా సామాజిక విప్లవక వరుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి వారిని పూల బొకే శాలువా తో సన్మానం చేసి ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకోవడం జరిగింది. వారు ఈ పదవితోనే ఆనందపడకుండా అంచలంచలాగా ఎదిగి పేదలకు సహాయం చేస్తూ వారికి ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చాలని డాక్టర్ ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. వీరితో పాటు స్థానిక పెద్దలు తెలుగు వెంకటన్న పాల్గొనడం జరిగింది.