పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మండల కాంగ్రెస్ నాయకులు

జూలై 21 తెలంగాణవార్త:- మంగపేట మండలం లోని వివిధ గ్రామాలను మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించి తగు జాగ్రత్త లు చేపట్టి పలు సూచనలు చేశారు అదేవిధంగా రాజుపేట లోని ముసలమ్మా వాగు ఉధృతి కి భూమి కోతకు గురైతున్న ప్రదేశాన్ని పరిశీలించి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారికి ఫోన్ ద్వారా సమాచారం తెలుపగ సానుకూలంగా స్పందించి తన ఫండ్ నుండి 800 మీటర్లు రివిట్మెంట్ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.... ఈ కార్యక్రమం లో జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా సెక్రటరీ మసిరెడ్డి వెంకట్ రెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకటి సంబశివారావ్, సింగల్ విండో డైరెక్టర్ గంట సునీత రామారావు, సీనియర్ నాయకులు చందర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....