పచ్చని చెట్లు బొగ్గు పాలు...
అడవులను నాశనం చేస్తున్న వ్యాపారులు..
మామూళ్ల మత్తులో అధికారులు!..
కలపతో బట్టిల్లో బొగ్గు తయారీ ...
15 రోజులకు 7,500 క్వింటాల విక్రయం ...
అధికారులతో అక్రమార్కుల కుమ్మక్కు ...
ఇతర రాష్ట్రాలకు తరలింపు...
పట్టించుకోని యంత్రాంగం...
తగ్గుతున్న అటవీ సంపద....
తిరుమలగిరి 04 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
వృక్షో రక్షతి రక్షిత అనే నా నానుడికి విరుద్ధంగా ధనర్జనే ధ్యేయంగా కొందరు బొగ్గు బట్టీలు నిర్వహించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు పచ్చని కలపను బొగ్గుగా మారుస్తున్నారు. పచ్చదనంతో కళకళలాడాల్సిన పల్లెలు మసిబారుతున్నాయి తెలంగాణ హరితహారం పథకంలో మొక్కలు విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారంతో పాటు మొక్కలు నాటుతూ వాటిని రక్షిస్తున్నారు ఇది ఇలా ఉండగా ఎక్కడ కనబడితే అక్కడ పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారులు చెట్లను నరికేస్తున్నారు గ్రామానికి దూరంగా ఉండాల్సిన బొగ్గు బట్టీలు జనవాసాలకు సమీపంలో బొగ్గు బట్టీలు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు సమీపంలో నిర్వహిస్తుండడంతో పొగ వ్యాపించి వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు వివరాలకు వెళితే... సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని సిద్ధి సముద్రం చౌళ్ళ తండా లో ఇళ్లకు 50 మీటర్ల దూరంలోనే బొగ్గుబట్టీలు పెట్టారు 30 ఏళ్ల నుండి సుమారు 15 ఎకరాలలో నిర్వహిస్తున్నారు ఇక్కడ పొగ వ్యాపించి బాటసారులు వాహన చోదకులకు దారి కనపడటం లేదు వెలిశాల రోడ్డు వెంటనే దాదాపు 8 నుండి 10 పైగా బొగ్గుబట్టీలు ఉండడంతో బాటసారి నాన్న అవస్థలు పడుతున్నారు రాకపోకలకు భయపడుతున్నారు ఇంకా కె ఆర్ కె తండా ,గుండె పూరి ,మామిడాల, జలాల్పురం , రాజ నాయక్ తండ, మర్రికుంట తండా ,బొగ్గు బట్టీలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు
అటవీ శాఖ అధికారుల ఆగడాలకు అమాయకులు బలి....
అడ్డదిడ్డంగా బొగ్గు బట్టి లకు అనుమతులు ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం చౌల తండా మర్రికుంట తండ పంచాయతీ పరిధిలో 20 బొగ్గుబట్టీలు ఉన్నాయి. అందులో వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అమాయకులైన చెంచు గిరిజనులను లక్ష్యంగా చేసుకొని బొగ్గుబట్టీల యజమానులు. వ్యాపారాన్ని కొనసాగిస్తారు. పనిచేస్తున్న కార్మికుల సదుపాయాల ఆరోగ్యం పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంటారు.బట్టీలకు సమీపంలో చిన్న చిన్న అడవి ఉండడంతో సంపద నరికి బొగ్గు బట్టీలకు ఆటోలు ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మొద్దులు కాల్చడం ద్వారా వచ్చిన బొగ్గును బెంగళూరు కలకత్తా ముంబై హైదరాబాద్ ఢిల్లీ వంటి నగరాలకు తరలిస్తుంటారు
అనారోగ్యాలతోప్రజల ...
బొగ్గు బట్టీలు గ్రామానికి సమీపంలో ఉండడంతో విషపు వాయువులతో విడుదలైన పొగ ధూళి దుమ్ముతో చిన్నారులు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఇలా గ్రామ ప్రజలకు తాగునీరు ఆహార పదార్థాల పై ప్రభావం చూపి అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. అక్రమంగా నిర్వహిస్తున్న కర్ర బొగ్గు పట్టిలను మూసివేసి బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు మండల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులకు నోట్ల కట్టలు తప్ప మా కష్టాలు అర్థం కావు. అవినీతి అటవీ శాఖ అధికారులు ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు. ఎంతమందిని వికలాంగులను చేస్తారు. ఎంతమందిని అనారోగ్యం పాలు చేస్తారు. బట్టీల నిర్వహణ పై సంబంధిత అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఒక్కో లారీకి లక్ష ఆర్జన
ఒక్కో లారీకి బొగ్గు ద్వారా లక్షకు పైగా సంపాదిస్తున్నారు చెట్లను కొట్టి పెద్ద ముద్దులు పక్కకు వేసి మిగిలిన కర్రలను బొగ్గుబట్టీలకు ఉపయోగిస్తారు రోజు ఒక లారీ వేప కర్రలను ఓ కట్టెల వ్యాపారి హైదరాబాద్ కు తరలిస్తున్నారు అధికారుల కను సన్నల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు