పేటలో పెద్ద ఎత్తున కట్టిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదు.
తెలంగాణ వార్త సూర్యపేట 3-1-26:
సూర్యాపేట లో పెద్ద ఎత్తున కట్టిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదు.
రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ కట్టారని చెబుతున్నారు.
కానీ ఏ మాత్రం నాణ్యత లేదు. రీ సౌండ్ తో పాటు, గాలి కూడా రావటం లేదని రైతులు చెబుతున్నారు.
ఫ్లాట్ ఫామ్ ఎత్తు కూడా చాలా పైకి కట్టారని అంటున్నారు.
బయట మెట్ల నుంచి ఫ్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం ఇబ్బందిగా మారింది.
మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్లలో మహిళలు, పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
మెట్ల నుంచి ఫ్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం వారికి ఇబ్బందిగా మారింది.
దీంతో వాళ్లంతా కూడా బయటనే కూరగాయలు అమ్ముతున్న పరిస్థితి.
ఇంత లోప భూయిష్టంగా ఉన్న మార్కెట్ కోసం ఖర్చు చేసింది రూ. 50 కోట్లు అని, 36 కోట్లు అని చెబుతున్నారు.
ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం నుంచి ఉన్నారు. అధికార పక్షం వేరే పార్టీ.
దీంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం పూనుకొని సత్వరమే మార్కెట్ ను అందుబాటులోకి తేవాలి. ఇలాంటి సమస్యలపైనే మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం.
అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
సూర్యాపేట్ ఇంటిగ్రేటేడ్ మార్కెట్ విషయంలో కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి.
చిన్నపాటి సమస్యలతో ఈ మార్కెట్ అందుబాటులో లేకుండా పోయింది.
మూడేళ్లుగా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా ఉండటం సరికాదు.
క
లెక్టర్ గారు వెంటనే ఈ సమస్య తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి.