పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్"జాటోత్ రామచంద్రనాయక్

మరిపెడ 25 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రలోని బస్టాండ్ ఆవరణం మరియు ప్రధాన వీధుల్లో శ్రమదాన కార్యక్రమం శుక్రవారం రోజు నిర్వహించరు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్"జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొని,ప్రజలతో కలిసి శ్రమదానంలో భాగస్వాములై,వారితో కలిసి చెత్త చెదారాన్ని వచ్చారు.పరిసరాల పరిశుభ్రత అనేది అందరి బాధ్యత అని పేర్కొన్న ఆయన,ప్రజలలో భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,టౌన్ అధ్యక్షులు,జిల్లా ప్రధాన కార్యదర్శులు,మాజీ సర్పంచులు,యువజన నాయకులు,ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రముఖ నాయకులు స్వయంగా పాల్గొనడం వలన ప్రజల్లో అవగాహన పెరిగిందని స్థానికులుఅభిప్రాయపడ్డారు.శ్రమదానంలో ప్రజల భాగస్వామ్యం కొనసాగాలని అన్ని వర్గాలను డాక్టర్"రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు.