సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి ఆర్.ఎం.పి, పిఎంపీల పాలాభిషేకం 

Jul 18, 2024 - 20:45
 0  8
సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి ఆర్.ఎం.పి, పిఎంపీల పాలాభిషేకం 

తుంగతుర్తి : జులై 18 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అధ్యక్షులు పప్పుల వెంకన్న ప్రభుత్వం ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు ఉచిత శిక్షణ ప్రకటన చేసినందుకు మండల ఆర్ఎంపి పిఎంపీల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎంపి పి ఏం పిల మండల అధ్యక్షుడు పప్పుల వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్.ఎం.పి పిఎంపి లకు ఉచిత శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందించేందుకుగాను సంబంధించిన అధికారుల కు జీవో చేయమని సూచన చేయడం  జరిగిందని తెలిపినారు. ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఎంపి, పీఎంపీల అపరిస్కృతంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసినారు. కార్యక్రమము లో ప్రధాన కార్యదర్శి పూసపల్లి బిక్షం, ఉపాధ్యక్షులు కత్తు రోజు కాంతయ్య, జోనల్ కోశాధికారి పులుసు శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులుబొనగిరి లక్ష్మీనారాయణ, మండల గౌరవ అధ్యక్షులు ఎస్ వి చారి , పొదిల మల్లేష్, జెర్రిపోతుల లక్ష్మణ్ గౌడ్, పూసపల్లి శ్రీను, సంపత్, మల్లయ్య వెంకన్న లక్ష్మణ్ తదితర ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333