పందిరి ఫౌండేషన్ అండ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

మునగాల 30 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండలం ముకుందా పురం గ్రామ పరిధిలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమం లో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత నారపరాజు నరసింగరావు,ఉమా మహేశ్వరి దంపతులు సేవా దృక్పథం తో వృద్దులకు అన్న ప్రసాదం మరియు అరటిపండ్లు అందజేయటం అభినందనీయం అని పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి అన్నారు.దాత నరసింగరావు దంపతులను అభినందించారు.ఈ కార్యక్రమంలో దాత నరసింగరావు(హైకోర్టు న్యాయవాది)ఫౌండేషన్ సెక్రెటరీ ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ సలహాదారు యస్ యస్ రావు,ఫౌండేషన్ సభ్యులు పనస నాగేశ్వర రావు,ఇంద్రశేఖర్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,రామకృష్ణ,నాగరాజు, భవ్య,సత్య సాయి సేవాసమితి సేవాదళ్ సభ్యుడు ఎర్రపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .