అంతర్జాతీయ కరాటే పోటీలలో డి రేపాక గ్రామ విద్యార్థుల ప్రతిభ

Aug 12, 2024 - 21:07
Aug 12, 2024 - 21:57
 0  9
అంతర్జాతీయ కరాటే పోటీలలో డి రేపాక గ్రామ విద్యార్థుల ప్రతిభ

అడ్డగూడూరు12 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసుఫ్ గూడా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్.. పురం వెంకటేశం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్స్ జరిగినాయి ఈ యొక్క టోర్నమెంట్స్ కు వివిధ దేశాల రాష్ట్రాల నుండి సుమారు 1500 ల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.అందులో అడ్డగూడూరు మండలంలో డి రాపాక గ్రామానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు 8 మంది పాల్గొని తమ వంతు ప్రతిభ కనబరిచి 10 మెడల్స్ సాధించినారు 1) సిహెచ్ అభిరామ్ కటా..విభాగంలో గోల్డ్ మెడల్ ఫైట్ విభాగంలో గోల్డ్ మెడల్ 2)ఎల్ హర్షిత కటా విభాగంలో గోల్డ్ మెడల్ 3)బి నిఖిల కటా విభాగంలో సిల్వర్ మెడల్ 4) సిహెచ్ చరణ్ తేజ్ కటా..విభాగంలో గోల్డ్ మెడల్
 ఫైట్ విభాగంలో గోల్డ్ మెడల్. 5)ఎం మణిదీప్ కటా విభాగంలో సిల్వర్ మెడల్ 6) సిహెచ్ రాజు కటా..విభగంలో సిల్వర్ మెడల్ 7)ఎం కార్తీక్ కటావిభాగంలో రజితం మెడల్ 8)సిహెచ్ చరణ్ కటా..విభాగంలో సిల్వర్ మెడల్ సాధించినారు.కోచ్ మాస్టర్ డా"వేముల సైదులుకి బెస్ట్ కోచింగ్ అవార్డుతో సన్మానించినారు.

 కృషి పట్టుదలతో సరియైన కోచింగ్ ఉంటే పట్టణాలకు ఏ మాత్రం పల్లెటూర్లు తీసిపోవని మరోసారి డి రేపాక విద్యార్థిని విద్యార్థులు నిరూపించినారు.వారికి గ్రామస్తులు,బంధువులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.