తస్మాత్ జాగ్రత్త యువత మేలుకోవాలి
NRI CELL TPCC CONVENOR SHAIK CHAND PASHA
గల్ఫ్ బాధితుల నాయకులమని, గతంలో జనాన్ని మోసం చేసిన వ్యక్తులు గ్రామాలు వదిలి పారిపోయిన వాళ్లు, గల్ఫ్ వలసవాదుల హక్కుల సంఘం నాయకులమని చలామణి అవుతున్నారు
తస్మాత్ జాగ్రత్త యువత మేలుకోవాలి**
**NRI CELL TPCC CONVENOR SHAIK CHAND PASHA
తెలంగాణ గల్ఫ్ ఉద్యమం 2005లో పాస్పోర్ట్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మొదలైన ఈ ఉద్యమం హంసకల్ పాస్పోర్టు తో ఏజెంట్స్ ముఖ కలయిక కలిసిన వాళ్లను ఒకటి పాస్పోర్టుపై మరొకరిని పంపడంపై ఉద్యమం మొదలైంది. ఇ ఉద్యమానికి మొదలు నాంది పలికింది మిస్టర్ షేక్ చాంద్ పాషా వేలాది మంది గల్ఫ్ జైల్లలో నరకయాతన/శిక్షలు అనుభవిస్తూ, భార్యా పిల్లలకు దూరమై తమ భర్తలు ఎక్కడ ఉన్నారో తెలియక అప్పుల బాధకు కుటుంబాలు చిద్రమైన సమయంలో మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమారులతో సహా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇట్టి విషయాన్ని సామాజిక కార్యకర్త షేక్ చాంద్ పాషా దిష్టికి రావడం జరిగింది. ఇది జాతీయ, అంతర్జాతీయ మీడియా, సామాజిక సేవకులకు, రీసెర్చ్ స్కాలర్ లకు సమాచారం అందించి ఆ గ్రామాన్ని ఫోకస్ చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరిగే సంఘటన సమాచారం సేకరించి కేంద్ర రాష్ట్రాలకు ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించి రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఘటన ఇది. ఈ ఘటన వెలుగు చూసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు కెనడా సహా అన్ని దేశాల రీసెర్చ్ స్కాలర్లు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు జగిత్యాలకు వచ్చి శ్రీ షేక్ చాంద్ పాషా గారి వద్ద సాక్షాదారాలు సేకరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోడ పత్రికలు వేస్తూ జాతీయ అంతర్జాతీయ మీడియా సహకారంతో ఉద్యమాలు చేసి ఎవరి సహకారం లేకుండా ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా నా స్థాయి కి తగ్గట్టు గల్ఫ్ బాధితుల పక్షాన నిలబడ్డాం. ఇది గమనించిన కొంతమంది రాజకీయ నాయకులు మెటపల్లికి చెందిన స్వర్గీయ కోమిరెడ్డి రాములు, మాజీ ఎంపీ నేటి ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధుయాస్ కి గౌడ్ గారు, శ్రీ ల్ రమణ గారు, మాజీ స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డి గారు, ప్రముఖ నటుడు మాజీ కేంద్రమంత్రి శ్రీ చిరంజీవి గారు మరియు వీరందరికీ నన్ను పరిచయం చేయించిన మాజీ కేంద్ర టూరిజం మంత్రి శ్రీ అమర్ సింగ్ తిలావత్ (బోత్ కాన్స్టిట్యూషన్) నాకు సహకారం అందించడం కోసం ముందుకొచ్చారు. అనంతరం లేట్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉద్యమాలను 2008లో గుర్తించి, 2009 ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్ విక్టిమ్స్ కుటుంబాలకు రూపాయలు లక్ష ఆర్థిక సహాయం అందించుటకు మరియు ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలో ఎన్నారై బోర్డ్ (కలెక్టరేట్లో) ఏర్పాటు చేసి శ్రీ శ్రీధర్ బాబు గారిని 2009లో నియమించడం జరిగింది.
అప్పటి తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని గల్ఫ్ లో మరియు యూరప్ లో మోసపోయిన బాధితులను రప్పించుకుంటూ ఏజెంట్ వ్యవస్థపై ఉక్కు పాదం మోపడం జరిగినాది. అప్పటి సమాచారం మంత్రి గౌరవనీయులు షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఏజెంట్లపై Sue Moto కేసులు పెడుతూ అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. అప్పటి ఎస్పీ తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ గంగాధర్ గారు నేను ఇచ్చిన నివేదికలు పరిశీలించి రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం Sue Moto కేసులు నమోదు చేసి చిన్న చితక పెద్దా చూడకుండా రిమాండ్ కు తరలించడం జరిగినది.
ఇది మిస్టర్ షేక్ చాంద్ పాషా గారు సాధించిన మొదటి విజయం. అప్పట్లో జైల్లో ఉండి వచ్చిన మోసగాళ్లు ఇప్పుడు తెరపైకి వచ్చి, గల్ఫ్ బాధితుల హక్కుల పరిరక్షణ వాదులుగా చలామణి అవుతూ, అనుభవం లేని రాజకీయ నాయకుల అండదండలతో కొత్త ముసుగులో గల్ఫ్ బాధితుల నాయకులమని చెప్పుకుంటూ, గల్ఫ్ బాధితులు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మొదటిగా 29 మంది సందర్శన వీసా లపై వెళ్లి, తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వారికి, 29 మందిని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సహాయం రూపాయలు లక్ష ఇవ్వాలని మెట్పల్లికి చెందిన అప్పటి ఎమ్మెల్యే స్వర్గీయ కోమిరెడ్డి రాములు, నేటి మాజీ మంత్రి నిర్మల్ కు చెందిన శ్రీ ఇంద్ర కిరణ్ రెడ్డి గారు అసెంబ్లీలో వాదించిన గొప్ప నాయకులు ఇది ఇలా ఉండగా 1 లక్ష రూపాయలు ఇచ్చారని ప్రచారం జరగగా, నేను స్వయంగా అప్పటి ఎన్నారై స్పెషల్ సెక్రటరీ శ్రీ రమణా రెడ్డి గారికి లేఖ రాయడం జరిగినది. ఎంతమందికి డబ్బులు ఇచ్చారో లిఖితపూర్వకంగా వారి అడ్రస్ లు కావాలని అడిగాను. దీనికి స్పందించి వారి వారి అడ్రస్ లు గ్రామాల వారిగా ఇచ్చారు. ఆ లిస్టు తీసుకుని నేను జీ న్యూస్ రిపోర్టర్ ను వెంబడి తీసుకొని, సొంత ఖర్చులతో కారులో అన్ని జిల్లాలు తిరిగి నిజామాబాద్ జిల్లాలో 17 మంది, కరీంనగర్లో 8 మంది, ఆదిలాబాద్ లో 3 మరియు మెదక్ లో ఒకరు, వారి కుటుంబాల వద్దకు వెళ్లి అడగగా, ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న నేను కలెక్టర్లకు బాధితుల పక్షాన లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పత్రాలు అందజేసి ఇట్టి విషయాన్ని అప్పటి ఎంపీ మధుయాష్కీ గారు, ల్ రమణ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి 2009 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రాగానే మొదటి అసెంబ్లీ సెషన్లో ల్ రమణ గారు మరియు కొప్పుల ఈశ్వర్ గారు ఈ విషయం చర్చించి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చామని ప్రస్తావించగా అవే పేరు శ్రీ ల్ రమణ గారు మరియు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు డబ్బులు బాధితులకు అందలేదని తెలుపగా అసెంబ్లీ వేదిక గా అప్పుడు 29 చెక్కులు శాంక్షన్ చేయించి మరుసటి రోజే మండలం
ఎమ్మార్వో ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మార్వో గారి ద్వారా హబ్సిపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి మహేష్ తండ్రికి రూపాయలు ఒక లక్ష చెక్కు ఇవ్వడం జరిగింది. ఇదేవిధంగా మిగతా ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 28 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజుల్లో నేను సాధించిన రెండో విజయం ఇది. ఈ విధంగానే ప్రభుత్వం జీవో నెంబర్ 256 విడుదల చేసి దాదాపు 300 మంది బాధితులకు 2011లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ ఫండ్ కేటాయించి బాధితులను ఆదుకోవడం జరిగింది.ఈ ప్రక్రియ 2014 వరకు సాగింది.
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కొత్త మరియు మొదటి ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారు గల్ఫ్ బాధితుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షలు ఇస్తామని జిల్లా కలెక్టర్లకు 1200 పాత దరఖాస్తులను వెనక్కు పంపడం జరిగింది. అప్పటి నుంచి రూపాయలు 5 లక్షల ఎక్స్ గ్రేషియా హామీలను నెరవేర్చాలని వినతి పత్రాలు సమర్పిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ ఆర్టిస్ట్ బృందాలతో సొంత ఖర్చులతో ఆటపాటలతో గ్రామాల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ ఉద్యమాన్ని కొనసాగించాను.
2017 లో డిసెంబర్ 27వ తేదీన ఎన్నారై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నారై సంఘాలు ప్రసంగిస్తూ వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అప్పటి ఎన్నారై సెల్ Dy. సెక్రెటరీ శ్రీ అరవింద్ సింగ్ గారు సూచనలు, సలహాలు, గల్ఫ్ మోసాలు ఎలా అరికట్టాలో నివేదికలు సమర్పించమని కోరగా, 5 గంటల చర్చలతో సచివాలయంలో నా సలహాతో నేను ఇచ్చిన నివేదికను సమర్పించడం జరిగినది అదే నివేదికను జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు 150 పెజీల సాక్ష్యాదారాలు మరియు 9 పెజీల నివేదికను వారి వారి అభిప్రాయాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు.
జిల్లా యంత్రాంగం షేక్ చాంద్ పాషా గారు ఇచ్చిన నివేదికలని ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగింది. ఇందులో ఒక్క ఐదు లక్షల ఆర్థిక సహాయం మినహా అన్ని సూచనలను అమలు చేయడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా నేను చేసిన సేవలను గుర్తించి గుమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుండి మరియు విదేశాల నుంచి ప్రముఖులు నా వద్దకు వచ్చి నన్ను అభినందించి వారి వద్దకు నన్ను ఆహ్వానించి నన్ను సత్కరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో అనగా భారత్ జూడో యాత్ర మరియు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర గురించి ప్రతి గ్రామంలో ముందుగానే వెళ్లి వాల్ పోస్టర్ వేస్తూ, పాంప్లెట్లు పంచుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. నేను ఎవరి నుంచి అంటే ప్రజల నుంచి గా…