నేలకొండపల్లి పోలీసు వారి విజ్ఞప్తి ""స్థానిక ఎస్సై పి సంతోష్ గారు
తెలంగాణ వార్త పాలేరు ప్రతినిధి : నేలకొండపల్లి పోలీసువారి విజ్ఞప్తి తేదీ:29.10.2024 న ఉదయం సమయంలో
పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ సబ్ డివిజన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే మెగా రక్తదాన శిబిరం - "నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్" నందు కలదు కావున నేలకొండపల్లి మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు,యువత,వ్యాపారస్తులు,అధికారులు, అనధికారులు మరియు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో రక్తహీనతతో బాధపడే వారికి ఈ రక్తదాన శిబిరం ద్వారా సహకరించాలని కోరడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా CP - శ్రీ సునీల్ దత్ గారు హాజరవుతున్నారు మరియు ఖమ్మం రూరల్ ACP -B. తిరుపతి రెడ్డి గారు, కూసుమంచి CI- T. సంజీవ్ గారు మరియు రూరల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అందరూ పాల్గొననున్నారు అని స్థానిక SI - P. సంతోష్ గారు తెలియజేశారు.