సీజన్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు...... హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ

Jul 10, 2024 - 19:49
Jul 10, 2024 - 19:50
 0  3
సీజన్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు...... హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ

మునగాల 10 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల వైద్యాధికా శ్రీశైలం గారి పర్యవేక్షణలో తాడ్వాయి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ మరియు 

జ్వర పీడితుల ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడo జరిగింది.. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాము.. ప్రతి ఒక్కరూ దోమల పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి దోమతెరలు వాడాలి, డెంగ్యూ జ్వరం వ్యాపింపజేసే దోమ పేరు 

ఎడిస్ ఈజిప్టి దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు

ఈ యొక్క దోమ పగటి పూట లో మాత్రమే మానవులను కుడుతుంది, ఈ దోమ మంచినీళ్లలో మాత్రమే పెరుగుతుంది, ఈ యొక్క దోమ రెక్కల పై తెల్లటి చారలు ఉంటాయి.. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తీవ్రమైన జ్వరం, అలసట, తలనొప్పి, కంటి రెప్పలు తెరవ లేకపోవడం,వాంతులు వంటివి కలిగి ఉండడం..

కాబట్టి బాధితులు వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఉచితంగా రక్త పరీక్షలు , చికిత్స తీసుకోవాల్సిందిగా 

తెలియజేశాము...

ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా గ్రామంలోనే జరపీడుతుల నుండి రక్త నమునాలు సేకరించి జిల్లా లేబరేటరీ 

హబ్ కు పంపించడం జరిగింది.

ప్రజలందరూ ఇట్టి వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము..

ఈ కార్యక్రమంలో డాక్టర్ వైష్ణవి, పబ్లిక్ హెల్త్ నర్స్ శారద ,

హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ , ల్యాబ్ టెక్నీషియన్ స్వాతి, ఏఎన్ఎంలు సుచరిత, మమత, ఆరోగ్య కేంద్రం ఆశ కార్యకర్తలందరూ , గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State