ఒకటే పోలీసు శాఖ విధానాన్ని అమలు చేయాలి. వేమూరి సత్యనారాయణ
మునగాల 28 అక్టోబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండల కేంద్రంలో ఒక సమావేశం లో సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచే పోలీస్ శాఖ వ్యవస్థలో పోలీసుల హక్కులను కాపాడవలసిన బాధ్యతను ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ కోరారు. గత వారం రోజులుగా ప్రత్యేక పోలీస్ బెటాలియన్లకు చెందిన పోలీసుల కుటుంబ సభ్యులు వారి న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని పిల్ల పాపలతో నిరసనలు తెలపడం విచారకరమని అన్నారు. తక్షణమే వివిధ బెటాలియన్లలో విధులు నిర్వహిస్తూ న్యాయపరమైన వారి హక్కుల కోసం ప్రశ్నిస్తున్న పోలీసులపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కు తీసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలను సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.