విద్యార్థినిపై లైంగిక వేదింపులు చేసిన హెడ్ మాస్టర్.
విషయం బయటకి రాకుండా రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చిన పోలీస్ అధికారి, విద్యాశాఖ అధికారి
కామారెడ్డి - బాన్సువాడ మండలంలోని దేశాయిపేట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరేందర్ తన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, శనివారం ఒక స్కూల్ రూంలో లైంగికంగా వేధించాడు.. ఇది చూసిన విద్యార్థులు ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు.
దీంతో వాళ్లు సోమవారం పాఠశాలకు రాగ నరేందర్ గైర్హాజరయ్యాడు.. ఈ విషయం బయటకి వెళ్లకుండా ఓ పోలీస్ అధికారి, ఓ విద్యాశాఖ అధికారి, పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసి ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చారు.
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి, హెడ్ మాస్టర్ నరేందర్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.