ధ్రువీకరణ పత్రాలు తెచ్చినవారి పేర్లను నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం పెనపహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఓటర్ సవరణ ప్రక్రియ(SIR) లో భాగంగా ఎన్యుమరేషన్‌లో మ్యాపింగ్‌కాని ఓటర్లతోపాటు వివరాలు తప్పుగా ఉన్న ఓటర్లకు సక్రమంగా నోటీసులు అందుతున్నాయా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు అందుకున్న వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించినప్పుడే వారిని ఓటర్ లిస్టులో చేర్చాలని అధికారులను ఆదేశించారు
కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్ రెడ్డి, ఆర్ ఐ రంజిత్ రెడ్డి, బి ఎల్ వో లు, సర్పంచ్ శోభ శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు... జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట