ఏసీబీ సోదాల వేళ అధికారుల గైర్హాజరుపై కమిషనర్ క్లారిటీ

Sep 3, 2026 - 20:06
 0  2
ఏసీబీ సోదాల వేళ అధికారుల గైర్హాజరుపై కమిషనర్ క్లారిటీ

మున్సిపల్ అధికారుల గైర్హాజరు వార్తలపై కమిషనర్ స్పందన

సూర్యాపేట మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం రేగిన వేళ మున్సిపల్ అధికారుల గైర్హాజరు వార్తలపై కమిషనర్ హనుమంత రెడ్డి స్పష్టతనిచ్చారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఉదయం 10:30 దాటినా పలువురు అధికారులు కార్యాలయానికి రారంటూ కొన్ని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై స్పందించిన కమిషనర్ హనుమంత రెడ్డి  మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సెక్షన్లలోని అధికారులు యథావిధిగా విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఆయన తెలిపారు. కేవలం ఏసీబీ సోదాలు జరుగుతున్న టీపీఓ కార్యాలయంలోని సిబ్బంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో లేరని ఆయన వివరించారు. ఈ అధికారిక వివరణతో అధికారుల గైర్హాజరుపై చెలరేగిన ఊహాగామాలకు పూర్తిగా తెరపడింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333