ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

Nov 4, 2025 - 06:03
 0  148
ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, మరియు 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుల తొమ్మిదవ షెడ్యూల్ చేర్పు మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి విజ్ఞప్తి మేము 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరపున రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో మన మండలం నుండి ఎమ్మార్వో తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎస్పి పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ, జిల్లా కమిటీ సభ్యులు పేరాల శ్రీనివాస్ మహారాజ్, వంగరి బ్రహ్మం బిసి డిస్టిక్ సెక్రటరీ, బిక్షం బీసీ జేఏసీ మండల నాయకులు, కొమ్ము యాకన్న డి.ఎస్.పి మండల నాయకులు, పేరాల వీరేష్ నాగారం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి