ఇద్దరు వ్యక్తులను సబ్ జైలుకు తరలింపు
తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
కోర్టు కు హాజరు కానీ ఇద్దరి వ్యక్తులిని సబ్ - జైలు సూర్యాపేట కు తరలించిన తిరుమలగిరి ఎస్సై. వెంకటేశ్వర్లు. తొండ గ్రామానికి చెందిన వేల్పుగొండ చిన్న ఎల్లయ్య, తిరుమలగిరి మున్సిపాలిటీ చెందిన పర్వతగిరి రాజులు గత కొంతకాలంగా కోర్టుకు హాజరుకానందున, వారి మీద తుంగతుర్తి కోర్టులో నాన్ బెయిల బుల్ వారంటూ జారి అయినది,అట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టు లో హాజరుపరచగా తుంగతుర్తి జడ్జి గౌస్ పాషా ఉత్తర్వుల మేరకు సూర్యాపేట సబ్ జైలుకు పంపనైనది అని తిరుమలగిరి ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు, వారి వెంట కానిస్టేబుల్స్ మురారి సైదులు హరిబాబు సైదులు ఉన్నారు