దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ని అమలు చేయాలి
చర్ల
తేదీ :04-02-2025
చర్ల మండల కేంద్రంలో స్థానిక ఎంపీ ఓ గారికి దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ ఉపాధి,సంక్షేమ రంగాలలో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రేగళ సుధాకర్ అధ్యక్షత సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.అనంతరంరేగళ్ల సుధాకర్ మాట్లాడుతూ సంక్షేమ రంగాలలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, 100% దివ్యాంగుల రుణాలను చర్ల మండలానికి అత్యధిక కేటాయించాలని, దివ్యంగుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు సురేష్ రెడ్డి, సాగర్, సుబ్రహ్మణ్యం, కేశవులు, తదితరులు పాల్గొన్నారు