విద్యార్థులు ఏడ్యూకేషన్,హెల్త్, సెల్ఫ్ ప్రొటెక్షన్ పైన మాత్రమే దృష్టి పెట్టాలి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ఐనవోలు 01 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో విద్యా శాఖ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల హెల్త్ కార్డుల పంపిణీ కార్యకమానికి వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పాల్గొని విద్యార్హులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు శరీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. థైరాయిడ్, పిసిఒడి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా కు అట్రాక్ట్ అవకుండా చదువు పైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఐనవోలులో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆపేక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డీఈవో వాసంతి, డీఎం అండ్ హెచ్ వో లలితా దేవి, ఎమ్మార్వో విక్రమ్, విద్యా, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.