బయో ఎంజైమ్ శుద్ధి చేసే నూతన ప్లాంటును ప్రారంబించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు..
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి4: ఈ రోజు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామములో భోధిధర్మ పీఠం ఆధ్వర్యములో ప్రపంచ క్యాన్సర్ డే సందర్బంగా ఆయుర్వేద బయోఎంజైమ్ శుద్ధి చేసే నూతన ప్లాంటును మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే BRS పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు ముఖ్యఅతిదిగా పాల్గొని ప్రారంబించారు.. అనంతరం క్యాన్సర్ రోగులకు ఉచిత ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, నారాయణ రెడ్డి, హాతీరాం నాయక్, ధనావత్ చిట్టిబాబు నాయక్, భోధిధర్మ వ్యవస్థాపకులు పండిట్ శ్రీనివాస్ గురుజి, ఉపేంద్ర గుప్తా, మూశాలి ఖాన్, మునీర్, సుప్రియా, మదన్ మోహన్, సోమారాజు, కీర్తి సంతోష్, భీష్మ తదితరులు పాల్గొన్నారు..