తెలంగాణలో పింఛన్ రికవరీ

Jul 13, 2024 - 17:27
 0  3

@ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

@ నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి పింఛన్ రికవరీ చేయాలని ఆదేశం

@ అనర్హుల జాబితాను సేకరించి అధికార యంత్రాంగానికి పంపిన ప్రభుత్వం

@ ఒక్క భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలోనే 200 మంది ఆసరా లబ్ధిదారుల నుంచి పింఛన్ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశం

@ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పింఛన్ పంఫిణీ చేసిన గత ప్రభుత్వం

@ వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 4,116 ఆర్థిక సాయం అందించిన గత ప్రభుత్వం 

@ తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధ్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులకు 4,000, దివ్యాంగులకు 6000 పంపిణీ చేయాలన్న యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం

@ డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంటెట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసిన ప్రభుత్వం

@ ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో లబ్ధిపొందుతూనే అదనంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం

@ సేకరించిన వివరాలను క్షేత్రస్థాయి యంత్రాంగానికి పంపి పింఛన్ రికవరీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశం

@ నోటీస్ అందించిన ఏడు రోజుల్లో తీసుకున్న పింఛన్ మొత్తం చెల్లించాలని లేని పక్షంలో ప్రభుత్వం నుంచి పొందుతున్న అన్నిరకాల పెన్షన్లను నిలుపుదల చేయాలని ఆదేశం

@ కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు జారీ

@ దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయల పింఛన్ సొమ్ము తిరిగి చెల్లాంచాలని నోటీస్ జారీ

@ ఆందోళనలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333