జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువ చేపట్టాలి.
ఓటు ఆవశ్యకత పై అవగాహన పెంచాలి.
వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.
సూర్యాపేట:- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువ చేపట్టాలని ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత అన్నారు. శనివారం కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు ఆవశ్యకత వాల్ పోస్టర్, ఫ్లెక్సీ లను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదిశగా సంబంధిత అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం లాగిన్ నందు బ్యాంక్ ట్రాన్సక్షన్ మానిటరింగ్ సెల్ ను ఎల్.డి.ఎం. బాపూజీ, జెడ్.పి సి.ఈ. ఓ అప్పారావు, డి.ఆర్.డి.ఓ మధుసూదన రాజు లతో కలసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.