తిరుమలగిరి ఎస్సై ఎస్పీ కార్యాలయం కు అటాచ్ ..?

Nov 14, 2025 - 08:52
 0  312
తిరుమలగిరి ఎస్సై ఎస్పీ కార్యాలయం కు అటాచ్ ..?

  2023 లో రాష్ట్రంలో ఏడవ ర్యాంక్...! 

గతంలో పిడిఎస్ కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై సురేష్ ... ! 

బాధితులకు భరోసా ఇవ్వని పోలీస్ స్టేషన్...? 

తోటి సిబ్బందితో సఖ్యత లేనందున...! 

సివిల్ తగాదాలు కుటుంబ పంచాయతీలో తల దూర్చడం... ! 

 

తిరుమలగిరి 14 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

2023 లో ఉత్తమ సేవలు అందించే పోలీస్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా 30 గుర్తించి త్రైమాసికానికి ర్యాంకింగ్ ఇచ్చారు.  ఇందులో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్​కు 7వ ర్యాంకు, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్​కు15వ ర్యాంకు లభించింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని విధుల్లో ఆలస్యం ప్రదర్శించడంతో తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లను ఎస్పీ కార్యాలయానికి గురువారం అటాచ్ చేసినట్లు చర్చనీ అంశంగా తెలిసింది వెంకటేశ్వర్లు మార్చ్ 13న తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు వారు వచ్చినప్పటి నుండి సివిల్ వివాదాలు భార్య భర్తల మధ్య కుటుంబ పంచాయతీలలో తలదూర్చి ఇరువురి నుండి తెలిసిన మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తోటి సిబ్బందితో సఖ్యతగా లేనట్లు ఆరోపణలు గతంలో ఇక్కడే పనిచేసిన పిడిఎస్ బియ్యం కేసులో బాధితుడి నుండి డబ్బులు వసూలు చేస్తూ కానిస్టేబుల్ తో సహా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు దీంతో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి వస్తున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదు అని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు ..తిరుమలగిరి పోలీసు స్టేషన్​ పరిధిలో 16 గ్రామ పంచాయతీలు, 23 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. మున్సిపాలిటీ, తిరుమలగిరి, అనంతారం, మాలిపురం, నందాపురం అనే మున్సిపాలిటీలు ఉన్నాయి. స్టేషన్​లో ఒక సబ్ ఇన్స్పెక్టర్​తో పాటు ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 12 మంది పోలీసులు, నలుగురు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి