డ్రగ్స్, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహనా

డ్రగ్స్, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహనా

Oct 18, 2024 - 16:36
 0  3

ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ 

 చుంచుపల్లి అక్టోబర్ 18 ( ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ శుక్రవారం చుంచుపల్లి మండలంలోని గౌతమ్ పూర్ గ్రామపంచాయతీలో గల సింగరేణి సేవా సమితి నందు ప్రగతి గ్రామ సమాఖ్య వివోఏ పద్మ ఆధ్వర్యంలో  డాక్రా మహిళలతో డ్రగ్స్, మహిళా భద్రత, సైబర్ క్రైమ్, డయల్ 100 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల భద్రత తమ బాధ్యతని, మహిళలకు పలు సలహాలు, సూచనలు చేశారు. షీ టీమ్ పని విధానం, మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించి  పలు  సూచనలు చేశారు. మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ఆన్ లైన్ వేధింపులు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, తదితర అంశాలపై వివరించారు. బాలికలు, మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకువచ్చిందని వివరించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని, గంజాయి ఎక్కడైనా ఉన్న తెలిసిన సమాచారం అందిస్తే మీ పేర్లు గోపియంగా ఉంచుతామని పిల్లలు గంజాయికి బానిస అవుతున్నారని దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని  నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటాన్ ఎస్ఐ సెల్వరాజ్, బ్లూ కోర్ట్ రాజా, వెంకటేశ్వర్లు గన్మెన్ చంద్రశేఖర్, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333