ఉపాధ్యాయులు బయలుదేరే బస్సులను  జెండా ఊపి ప్రారంభించిన

జిల్లా కలెక్టర్

Aug 2, 2024 - 17:36
Aug 2, 2024 - 17:51
 0  3
ఉపాధ్యాయులు బయలుదేరే బస్సులను  జెండా ఊపి ప్రారంభించిన

జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటీవల పదోన్నతులు  పొందిన ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖాముఖీ  కార్యక్రమానికి  జిల్లా నుండి విద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్.శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ముఖాముఖీ  సమావేశం ఏర్పాటు చేసిన  సందర్భంగా శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా   విద్య శాఖ  పరిధిలో మొత్తం 360 మంది ఉపాధ్యాయులు  జిల్లా ఐ డి ఓ సి కార్యాలయం నుండి  తొమ్మిది (9 ) ప్రత్యేక బస్సుల్లో అందరు హైదరాబాద్ కి వెళ్తున్నట్లు కలెక్టర్ బి .యం.  సంతోష్ తెలిపారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు , జిల్లా విద్య శాఖ అధికారి ఇందిరా,  ఈ.డి ఎస్. సి రమేష్ బాబు, జిల్లా క్రీడా అధికారి బి.ఎస్ ఆనంద్,  ఎం.ఈ.ఓ  సురేష్, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State