కామ్రేడ్ ముద్రబోయిన నారాయణకు నివాళులర్పించిన సిపిఐ నాయకులు
అడ్డగూడూరు 09 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సిపిఐ మాజీ గ్రామశాఖ కార్యదర్శి కామ్రేడ్ ముద్ర బోయిన నారాయణ మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెడే చంద్రయ్య, మండల కార్యదర్శి రేకల శ్రీనివాస్,జిల్లా సమితి సభ్యులు శాంతి కుమార్ ఈ సందర్భంగా చెడే చంద్రయ్య మాట్లాడుతూ.. కోటమర్తి గ్రామంలో కామ్రేడ్ నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీని బలోపేతం చేశాడని, ఆనాటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి నాయకత్వన్న కోటమర్తి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయుటలో నారాయణ పాత్ర ఉన్నదని ఆయన అన్నారు.నారాయణ మృతి సిపిఐ పార్టీకి తీరనిలోటని వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కోటమర్తి గ్రామ సిపిఐ నాయకులు నిమ్మల బుచ్చయ్య చింత సోమయ్య చిప్పలపల్లి నరసింహ నారాయణ కుమారుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.