సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగించాలి
కొండపాక తెలంగాణ వార్త :- కుకునూరుపల్లి.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని బహుజన కోసం పాటుపడిన పాపన్న బీద ప్రజల ఆశాజ్యోతి అని, దాకూరి కుమారస్వామి అన్నారు.సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా ఓబీసీ మోర్చా కుకునూర్‌పల్లి మండల అధ్యక్షులు డాకూరి కుమార స్వామి ఆధ్వర్యంలో లో కుకునూర్‌పల్లి మండల కేంద్రం లొ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం లో పలువురు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులు అన్నింటిలో ముందుండాలని, బహుజన రాజ్యాధికారం కోసం, కొట్లాడిన వ్యక్తి అని, ఆయన చేసిన పలు మంచి పనులను స్మరించుకున్నారు, పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు... కార్యక్రమం లో BJP కుకునూర్‌పల్లి మండల అధ్యక్షు డు సంపత్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శులు దాసరి స్వామి, సదానంద్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజు,పోచమైన స్వామి,అనిల్, sc మోర్చా మండల అధ్యక్షు డు నాగరాజు,కార్యదర్శి సంతోష్, సీనియర్ నాయకులు కృష్ణ మరియు మండల గౌడ సంఘము సభ్యులు పాల్గొనడం జరిగింది