ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదు ఎస్సై వెంకటేశ్వర్లు

Nov 12, 2025 - 04:58
 0  78
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదు ఎస్సై వెంకటేశ్వర్లు

  తిరుమలగిరి 12 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ అధికారుల సమక్షంలో వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించబడింది  ఈ సందర్భంగా స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమలగిరి చౌరస్తా నుండి 100 మీటర్ల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారాలు నిర్వహించరాదని తెలియజేశారు. మున్సిపల్ అధికారులు నిర్ణయించిన సెట్‌బాక్స్ ప్రాంతాలలోనే వ్యాపారం జరపవలసినదిగా సూచించారు. సూచనలను పాటించని వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ   మరియు స్థానిక చిరు వ్యాపారులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి