జూనియర్ కళాశాల లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

Sep 9, 2024 - 17:36
 0  3
జూనియర్ కళాశాల లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

ప్రిన్సిపాల్ వీరన్నకాళోజి కి నివాళులు:- అర్పిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు

గద్వాల టౌన్:-ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని ప్రిన్సిపాల్ వీరన్న అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ వీరన్న ఆధ్వర్యంలో  నారాయణ రావు 110 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వీరన్న  మాట్లాడుతూ... ప్రజాకవి కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు.ఆ మహానుభావుడు కలిగించిన స్పూర్తిని నేటి తరాలకు అందించాలని, యుద్ధం గెలవాలంటే అయుధాలే అక్కరలేదు, అక్షరాలతో గెలిచే, గెలిపించే వీరులుంటారు, తెలంగాణా యాస, తెలుగు భాషను ఊపిరిగా, తెలుగు అక్షరాన్ని ఖడ్గం గా చేసుకొని పోరాడిన తెలుగు వీరుడని, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు. కాళోజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షల్లో తెలుగు సబ్జెక్టులో అత్యధిక మార్కులు తెచ్చుకున్న సెకండియర్ విద్యార్థులకు తెలుగు అధ్యాపకులు శేఖర్ గౌడ్,పవన్ కుమార్ లు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333