జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యత చేపట్టిన...తేజస్ నందలాల్ పవార్.

Jun 16, 2024 - 21:06
Jun 16, 2024 - 22:03
 0  8
జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యత చేపట్టిన...తేజస్ నందలాల్ పవార్.
జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యత చేపట్టిన...తేజస్ నందలాల్ పవార్.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేద్దాం.

అందరం సమన్వయంతో పనిచేసి జిల్లాని అభివృద్ధి బాటలో నిలుపుదాం.

జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలి.

 జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.

సూర్యాపేట జిల్లాకు ఏడవ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.

సూర్యాపేట  16 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 ని॥ల కు నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు తేజస్ నందలాల్ పవార్.  కలెక్టరేట్  లోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్కు పుష్పగిచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కలెక్టర్ తేజ సునందలాల్ పవర్ స్వస్థలం బీహార్ రాష్ట్రంకు చెందినవారు. మహబూబ్నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్గా, అదనపు కలెక్టర్ గా పని చేశారు. కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి బదిలీపై సూర్యపేట కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత , ఏవో సుదర్శన్‌ రెడ్డి ఆన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333