విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలి:జిల్లా కలెక్టర్

Feb 20, 2024 - 18:07
 0  63
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలి:జిల్లా కలెక్టర్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలి:జిల్లా కలెక్టర్

జోగులాంబ - గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల పట్టణం విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ అన్నారు..మంగళవారం గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం,తేరు మైదానం లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మైదాన పరిసరాలను మరియు తేరు మైదానంలో ఖేలో ఇండియా క్రీడల కేంద్రాన్ని పరిశీలించారు.ఇండోర్ స్టేడియంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జిమ్, షటిల్, తైక్వాండో ఇతర సదుపాయాలు కల్పించడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం  కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం,తేరు మైదానం క్రీడలకు ఎంతో అనువుగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలలో రాణిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలకు రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. ఈ సందర్భంగా క్రికెట్, కరాటే,  పూట్ బాల్ తదితర క్రీడలలో రాణించిన విద్యార్థులను అభినందించారు. మొట్ట మొదటిసారిగా ఇండోర్ స్టేడియం కు వచ్చిన జిల్లా కలెక్టర్ ను క్రీడల శాఖ అధికారి క్రీడాకారులు బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రికెట్ బ్యాటింగ్, షటిల్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. 

             ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి బిఎస్ ఆనంద్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ జితేందర్, పూట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్, పి ఈ టి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ, ఖేలో ఇండియా అధికారి శ్రీనివాసులు, మహిళా పిఈటి సంఘం అధ్యక్షులు హైమావతి, వీటిల సంఘం కార్యదర్శి శైలజ,  టైక్వాండో రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, శ్రీనివాసులు అరుణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333