జర్నలిస్ట్ జిలుకర తిరుమల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి,ఇంచార్జీ ఝాన్సీరెడ్డి

పాలకుర్తి 31 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన జీలకర్ర తిరుమల్ పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన వి6 వెలుగు దిన పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న జిలుకర తిరుమల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుం టుండగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి,మండల నాయకులు గడ్డం యాక సోమయ్య,కారుపోతుల శ్రీనివాస్,మాదాసు హరీష్, గోనె మహేందర్ రెడ్డి,పోగు శ్రీనివాస్,మేడారపు సుధాకర్,బండిపెల్లి మనమ్మ,తదితరులున్నారు.