తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు డి,జె,ఎఫ్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఆర్థిక సాయం

ఎండపల్లి 31మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డిజెఎఫ్)ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఆర్థిక సాయం అందజేశారు.జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు తిరుపతికి ఇద్దరు పిల్లలు.పాప వర్షిని ప్రస్తుతం ఐదో తరగతి బాబు అశ్విత్ రెండవ తరగతి. మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.వీరికి ఇటీవలే తల్లి దూరమయింది.పిల్లలకు తల్లి దూరమైందనే బాధతో తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.అనాథలుగా మారిన పిల్లలు సహాయం కోసం ఎదురుచూపులు అనే పోస్ట్ సోషల్ మీడియ వేదికగా వీక్షించిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డిజెఎఫ్)యూనియన్ ఎండపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు స్పందించి డి జె ఎఫ్ సంఘం పాత్రికేయుల తరపున సోమవారం చిన్నారులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎవరైనా ఆర్థిక సహాయం అందించాలనుకున్న దాతలు శేఖర్ 9849111504 నెంబర్ కి ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాల్సిందిగా చిన్నారులు వేడుకుంటున్నారు.