జన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 దంతాలపల్లి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెడికేర్ మల్టీ స్పెషాలిటీ తొర్రూరు వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామంలోని 180 మంది రోగులకు సీజనల్ వ్యాధుల, షుగర్, బిపి, తదితర వ్యాధుల పరీక్షలు నిర్వహించి,ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ను పాటించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో వివేక్రం, మండల పంచాయతీ అధికారి అప్సర్ పాషా, డాక్టర్ నరేష్(ఎండి), కిరణ్, కవిత, సందీప్, జన వికాస సెంటర్ మేనేజర్ కందుకూరి సుకన్య, శోభారాణి, యాగలక్ష్మి, విలేజ్ లీడర్లు వెంకటరత్నం, ఊర్మిళ, యాగలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.