వాహనదారులకు ట్రాఫిక్ నియామ నిబంధనలను సూచిస్తున్న ఎస్ఐ సాయిరాం

Mar 17, 2025 - 20:47
Mar 17, 2025 - 21:00
 0  6
వాహనదారులకు ట్రాఫిక్ నియామ నిబంధనలను సూచిస్తున్న ఎస్ఐ సాయిరాం

వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని  సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. స్థానిక బస్టాండ్ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.  అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నా, వేగంగా నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు.వాహనదారు లు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని, నిబంధ నలు అతిక్రమించ రాదని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు.  వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనాల నెంబర్లను టాంపరింగ్ చేయడం,ట్రిపుల్ రైడింగ్, వాహనాలకు అదనపు సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై  దృష్టి  సారించి  చర్యలు తీసుకుంటామని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333