వరద ప్రభావిత బాధితులను పరామర్శించిన 

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క

Sep 2, 2024 - 18:21
Sep 2, 2024 - 21:01
 0  43
వరద ప్రభావిత బాధితులను పరామర్శించిన 

తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రం మండలం,నెల్లికుదురు మండలాల్లో ని ఆయా గ్రామాలు  పురుషోత్తమే గూడెం, సీతారాం తండా, రావిరాల, గ్రామాల్లో వరద ప్రభావిత,బాధితులను సోమవారం పరామర్శించి, గ్రామంలోని ప్రాంతాలను, పరిశీలించి, వారికి మనోధర్యమిచ్చిన  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు,జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు,ఈ పర్యటనలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కెకన్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) డేవిడ్, ఆర్డీవో అలివేలు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, స్థానిక తహసీల్దార్స్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333