చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరో ...?

Jan 17, 2026 - 07:15
 0  168
చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరో ...?

  మున్సిపాలిటీలో గత రిజర్వేషన్లు కొనసాగేనా..?

ఈసారి రిజర్వేషన్ ఎస్సీ నా బీసీ నా... ? 

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు... ! 

చైర్మన్ పీఠం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నేతలు. .! 

తిరుమలగిరి 17 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ లో రెండోసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ  వేడివేడిగా జరుగుతున్నది. పోయినసారి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 5వ వార్డు కౌన్సిలర్ పోతరాజు రజిని ఛైర్పర్సన్ గా వదవి చేపట్టారు. కొంతకాలం తర్వాత 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోనికి రాగానే కొంతమంది కౌన్సిలర్ లు బి ఆర్ ఎస్ పార్టీ లో గెలిచి తమ రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆనాటి ఛైర్పర్సన్ రజిని వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి ఛైర్పర్సన్ రజిని పై అవిశ్వాసం తీర్మానం పెట్టడం తో మరో ఏడాది పదవీకాలం ఉండగానే రజిని తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 8వ వార్డులో బి ఆర్ ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ శాగంటి అనసూయ ను ఛైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. అయితే ఒకే టర్మ్ లో చైర్మన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగగా ఎస్సి సామాజికవర్గం నాయకులే చైర్మన్ పదవిని అనుభవించారన్నది వాస్తవం. నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉంటాయా.. మారతాయా..? అన్న సంధిగ్ధం ఆశవాహుల్లో ఉత్కంట కు దారితీస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన రిజర్వేషన్లను పదేళ్లు కొనసాగించాల్సి ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ రిజర్వేషన్లపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దింతో చైర్మన్ పీఠం పై రాజకీయ నాయకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 15455 మందిగా ఉన్నారు. అందులో మహిళలు 7817, పురుషులు 7638 ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఏదేమైనా గత ఎన్నికతో పోల్చితే ఎస్సీ, బీసీ ఓటర్ల సంఖ్య పెరిగిందనేది వాస్తవం. త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారతాయని రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గత ఎన్నికల్లో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఈసారి బీసీలకు లేదా జనరల్ గా రిజర్వ్ అయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా  కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే వార్డుల డ్రా పద్దతి లో ఆశవహుల ఉత్కంట కు తెరపడనుండి.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి