చిన్న తండా నుంచి అంతర్జాతీయ వరకు సాయిప్రశాంత్

Nov 4, 2025 - 05:55
 0  149
చిన్న తండా నుంచి అంతర్జాతీయ వరకు సాయిప్రశాంత్

తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

  ఈ రోజుల్లో ఒక డిగ్రీ పూర్తిచేయడమే చాలామందికి సవాలుగా మారినప్పుడు, సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండల పరిధిలోని మోండిచింత తండా అనే చిన్న గిరిజన గ్రామానికి చెందిన లావుద్యా సాయిప్రశాంత్ మూడు డిగ్రీలు పూర్తిచేసి అందరికీ ప్రేరణగా నిలిచారు.   సాయిప్రశాంత్ ఇటీవల విడుదలైన ఫలితాలలో రెండవ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. భారతదేశంలోని వెల్లూరు మరియు ఫ్రాన్స్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు   అక్టోబర్ 30, 2025న వెల్లూరులోని వీఎఐటీ ప్రాంగణంలో జరిగిన ఘనమైన వేడుకలో, తరఫున మార్క్ రూసెట్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం సాయిప్రశాంత్ జీవితంలో గర్వకారణమైన క్షణంగా నిలిచింది అని అన్నారు.

ఈ కార్యక్రమం పద్మభూషణ్ ప్రొఫెసర్ టీ. రామస్వామి మరియు మిస్టర్ ఎటీన్ రోలాండ్-పియేగ్యూ సాన్నిధ్యంలో జరిగింది.అదేవిధంగా ఈ కార్యక్రమంలో  ప్రొఫెసర్ ఆన్ ఫ్రాన్స్వా జట్టారా గ్రోస్  డాక్టర్ ఆర్. సీనివాసన్   డాక్టర్ జయప్రకాశ్ ఎన్.ఎస్.  డాక్టర్ కృష్ణన్ వి.  మరియు (SBST), కు చెందిన అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సాయిప్రశాంత్ మాట్లాడుతూ   నా తల్లిదండ్రుల కష్టాలు చూసి విద్య విలువ నాకు అర్థమైంది. అదే బాధ నన్ను బలంగా చదవాలని, ఎదగాలని ప్రేరేపించింది.  యూరప్‌లో పరిశోధన సమయంలో, ఆయన వ్యవసాయం మరియు ఔషధ మొక్కలపై రెండు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేసి, స్లోవాకియాలోని కోమెనియస్ యూనివర్సిటీ లో రెండు జర్నల్ పేపర్లు కూడా సమర్పించారు అని చెప్పుకొచ్చారూ.  ప్రస్తుతం సాయిప్రశాంత్ తన పిహెచ్.డి. (Ph.D.) చదువుకు సిద్ధమవుతున్నా అని. ఆయన పరిశోధన లక్ష్యం —వ్యవసాయం, పర్యావరణం మరియు ఔషధ శాస్త్రాల మధ్య ఉన్న అనుసంధానాన్ని అధ్యయనం చేసి, సుస్థిర వ్యవసాయం మరియు కొత్త ఔషధాల అభివృద్ధికి తోడ్పడుతనని అని అన్నారు. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలు మహత్తరమైన సవాళ్లను ఎదుర్కొంటాయి. అందుకే ఈ రంగాల్లో సమస్యలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలను కనుగొని సుస్థిర విద్య, వైద్య వ్యవసాయం మరియు ఔషధ అభివృద్ధికి తోడ్పడే శాస్త్రవేత్తగా మారాలనే కల నాలో ఉంది, అని ఆయన గర్వంగా చెప్పారు. దీంతో గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి