అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్న ఇసుక దందా

Nov 3, 2025 - 21:31
Nov 4, 2025 - 18:31
 0  3
అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్న ఇసుక దందా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్న ఇసుక దందా ఇసుక నింపుతున్నట్లు సమాచారం రావడం తో తప్పించేందుకు అదికారుల ప్రయత్నం. పోలీసు శాఖ లో ఓ ఇద్దరు రెండవ క్యాడర్ పాత్ర పై అనుమానం.. ఆత్మకూర్ ఎస్.. ఇసుక దందాలు అరికట్టే ప్రయత్నంలో మండలంలోని రెవెన్యూ పోలీసు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీస్ శాఖలో ఇద్దరు సెకండ్ క్యాడర్ అధికారుల కనుసనల్లో ఇసుక దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.మండల పరిధిలోని మక్త కొత్తగూడెం గ్రామంలో గత కొంతకాలంగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుoది . స్థానికులతో పాటు సర్వారం పరిసర తండాల నుండి మక్తా కొత్తగూడెం ఏటి నుండి ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన నాలుగు ట్రాక్టర్లు ఏటిలోని స్మశాన వాటిక సమీపంలో కూలీలతో నీళ్లలో నుండి ఇసుక ట్రాక్టర్లలో నింపుతుండగా స్థానికులు కొందరు పోలీసులకు రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇసుక ను అరికట్టాల్సిన అధికారులు రెవెన్యూ నుండి జిపిఓ పంచాయతీ కార్మికుడు ఏటి వద్దకు వెళ్ళారు. పోలీసుల సమాచారం తెలుసుకొని ఎస్ ఐ ట్రాక్టర్లను తీసుకురమ్మని పంపించగా సిబ్బంది ఏటి వద్దకు చేరుకోక ముందే పోలీస్ శాఖ సంబంధించిన సెకండ్ క్యాడర్ అధికారి ఒకరు ట్రాక్టర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు రెవెన్యూ సిబ్బంది ట్రాక్టర్లను పట్టుకునేందుకు వస్తున్నారని ఇసుక అక్రమ దారులకు ఫోన్లో చెప్పడం తో సగం వరకు ఇసుక నింపిన ఇసుక ఆక్రమణదారులు అధికార సిబ్బంది రాకముందే ఇసుకను ఏటిలో పోసి కాలి ట్రాక్టర్లతో వెనుతిరి గారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సిబ్బంది కాలి ట్రాక్టర్లు చూపించి ఇసుక దందా నడవట్లేదు అని వెనుతిరిగి వెళ్ళి పోయారని స్థానికులు ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్ల తరలింపు వారి వద్ద పోలీసు సిబ్బంది ముడుపులు వసూలు చేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఏటి నుండి ఎన్నోసార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ డబ్బులు వసూలు చేసుకుని వదిలేసి ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకోకపోవడంపై స్థానికులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లపై వెళ్లే బిస్కెట్ ట్రాక్టర్లు మాత్రమే పట్టుకుంటున్న పోలీసులు ఏటి నుండి ఇసుక తరలిస్తున్న తీరు అరికట్టలేకపోతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.ఒక్కో ట్రాక్టరు ఎనిమిది నుండి పదివేల రూపాయలకు ధరకు అమ్మడంతో సామాన్యుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేవారు ఇసుకను అధిక ధర కొనలేకపోతున్నారు. మండల స్థాయి అధికారులు ఇసుక అక్రమ రావాలని అరికట్టి ఇసుక అక్రమ రవాణాకు అంతర్గతంగా సహకరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.