అనుమతులు లేకుండా వేసిన బోరుని సీజ్ చేయాలి
మునగాల 17 మార్చి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో ప్రభుత్వ స్కూల్ లో ఉన్న బోరింగ్ పక్కనే మరో వ్యక్తి బోర్ వేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు అధికారులు ఎంత చెప్పినా వినకుండా తన ఇష్టానుసారంగా బోరు వేయడం సరికాదని గ్రామ ప్రజలు యువకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేతకు ప్రహరీ గోడ పక్కన వేసిన బోర్ ను వెంటనే సీజ్ చేయాలని గ్రామ ప్రజలు యువకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ప్రభుత్వ బోరు పక్కన బోరు వేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఎటువంటి అనుమతి లేకుండా బోరు వేయడం సరికాదని అన్నారు. వెంటనే బోర్ వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని బోర్ను సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లూరి దుర్గయ్య, పడిశాల లచ్చయ్య, వెంకులు, ఉపేందర్ ,శ్రీకాంత్, నాగరాజు, గురవయ్య, సురేష్, స్వామి, సింహాద్రి, వినయ్, సందీప్, అంజి తదితరులు పాల్గొన్నారు.