చిన్న ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్ 3 ఉద్యోగం సాధించిన ఉడుగు తిరుమలేష్

Jan 17, 2026 - 20:45
 0  99
చిన్న ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్ 3 ఉద్యోగం సాధించిన ఉడుగు తిరుమలేష్

 అడ్డగూడూరు 17 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉడుగు లింగయ్య కుమారుడు ఉడుగు తిరుమలేష్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలనలో కొలువుల పండుగ సందర్భంగా గ్రూప్ 3 ఉద్యోగం సాధించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ శాఖల మంత్రుల సమక్షంలో నియామక పత్రం అందుకున్న నిరుపేద విద్యార్థి ఉడుగు తిరుమలేష్ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొని పట్టు వీడని విక్రమార్కుల గ్రూప్ 3 విజయం సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.బంధువులు, స్నేహితులు,గ్రామస్తులు అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ..సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలోని యువత అతనిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని గ్రామస్తులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333