చాటకూలి కార్మికురాలికి రావుల ఆర్థిక సహాయం

వనపర్తి పటటణ గంజి చాటకూలి కార్మికురాలు ఎశమొని.పద్మ 33వ వార్డులో రొట్టెలు తయారు చేయుటకు షెడ్డు నిర్మించుకొని ఉపాధి పొందుతుంది.
విద్యుత్తు షాక్ వల్ల షెడ్డు దగ్ధమైంది. పేదరాలైన ఆమె పరిస్థితి మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్
మాజీ పార్లమెంట్ సభ్యులు , వనపర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రావుల.చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆమెకు 5000రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రేణుబాబు,కడెం.శేఖర్,దండు.శ్రీను,దండు.యాది,రమేష్ యాదవ్,వజ్రాల.రమేష్ పాల్గొన్నారు.