చద్దన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం

Mar 21, 2025 - 19:44
 0  4
చద్దన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం

సూర్యాపేట :రోజు చద్దన్నం తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని,సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని మన చద్దన్నం ఫ్రాంచైజ్ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ పసల, ఎస్. క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కుడకుడ  రోడ్డులో గ్లోబల్ హీలింగ్ సెంటర్ ముందు వారు మన చద్దన్నం ఫ్రాంచైజ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చద్దన్నంతో ఏ కాలంలోనైనా మేలే జరుగుతుందని,ఎండాకాలలో మరింత బాగా ఉపయోగపడుతుందన్నారు.చద్దన్నం పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుందని తెలిపారు.పేగులను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు రోగ నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తుందని చెప్పారు.శరీరానికి మంచి బలాన్ని  అందిస్తుందన్నారు.గుండె, ఎముకల ఆరోగ్యానికి,బరువు తగ్గటంతో పాటు జీర్ణక్రియల సమస్యలు తగ్గుతాయని అన్నారు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలన్నారు.తమ వద్ద నాచురల్ ఆహార పదార్థాలు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వై.గిరి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333