ఘోర రోడ్డు ప్రమాదం ఉపాధ్యాయురాలు మృతి
అర్వపల్లి 17 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. చోటుచేసుకుంది వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కేంద్రంలోని .ఈరోజు నల్గొండ నుండి Ts 05 Ev 1299 నెంబర్ గల షిఫ్ట్ కారులో ఉపాధ్యాయులు.. పాఠశాలలకు వెళుతుండగా ప్రమాదవశాత్తు అరవపల్లి గ్రామం దగ్గరికి రాగానే కారు టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీకొట్టడంతో .పులగం కల్పన తుంగతుర్తి kgbv ప్రిన్సిపాల్ స్పాట్లోనే మృతి చెందింది పోరెడ్డి గీత రెడ్డి కి సీరియస్ గా ఉన్నది , ఈమె తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్ పీ హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు.సునీత రాణి తుంగతుర్తి మండలం అన్నారం హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఈమెకు సాధారణ గాయాలు అయినవి.అల్వాల్ ప్రవీణ్ కుమార్ ఇతను తుంగతుర్తి జెడ్ పీ హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు...ఒక ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్లోనే మృతి . మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలు..రావులపల్లి హెడ్మాస్టర్, మరొక హెడ్మాస్టర్ తులసి లకు గాయాలు.. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు దీంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాల సిబ్బంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి