కాజీపేట ఫాతిమా బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీంచిన ఎంపీ డా.కడియం కావ్య
హన్మకొండ తేది :14.11.2024 : వేగంగా నిర్మాణ పనులు మార్చి నెలలో కాజీపేట బ్రిడ్జి నిర్మాణం పూర్తి
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో త్వరలోనే నగర రూపురేఖలు మారనున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన మెటీరియల్ ను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి బ్రిడ్జి స్లాబ్ నమూనా, రైల్వేట్రాక్ పై నిర్మించే పనులను మ్యాపింగ్ ద్వారా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మీడియతో మాట్లాడుతూ....ఎన్నో ఏళ్ల కళగా ఉన్న కాజిపేట బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి నెలలో బ్రిడ్జి అందుబాటులో వస్తుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గార్ల కృషితో నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం మెటీరియల్ చతిస్గడ్ రాష్ట్రం నుండి తీసుకురావడం జరిగిందన్నారు. వారం రోజుల్లో పూర్తి మెటీరియల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ నెల 21 వ తేదీన రైల్వే జీఎం గారిని కలసి పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలతో పాటు కాజీపేట రైల్వే బస్టాండ్ ఏర్పటుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.