పవన్ సాయి హాస్పిటల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
అడ్డగూడూరు 17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పవన్ సాయి హాస్పిటల్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శనివారం రోజు చేశారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో టీవీయుఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో పవన్ సాయి హాస్పిటల్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసి పవన్ సాయి హాస్పిటల్స్ గొప్పతాన్ని ప్రజలకు తెలియజేశారు.పవన్ సాయి హాస్పటల్ అందరిదీ,ప్రజలది హాస్పిటల్స్ సేవలను వినియోగించుకోవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆసర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆసర్ల బీరప్ప,కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గిలకత్తుల రమేష్ గౌడ్,వార్డు మెంబెర్లు రాజశేఖర్ రెడ్డి,గజ్జెల్లి రవి,కళాకారుల మండల అధ్యక్షుడు బాలెంల డప్పు మల్లేష్,మాజీ సర్పంచ్ శ్రీశైలం,దళిత సంఘం నాయకులు గూడెపు నరేష్,మందుల అవిలయ్య,బొడ ఎల్లయ్య, మేకల యాదగిరి,బీసీ సంఘం నాయకులు వరుణ్,సాయి కుమార్,సన్నీ,మహేష్,దినేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.