ఉచిత వైద్య శిబిరానికి విశిష్ట స్పందన
ఖమ్మం గాంధీచౌక్ వర్తక సంఘం భవనంలో ఐఎన్టియుసి డిస్టిక్ సెక్రెటరీ గజ్జి సూర్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిఎస్సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకుని రిజిస్టర్డు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులందరికీ సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం కల్పిస్తున్న గౌరవనీయులైన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు . కావున ప్రతి ఒక్క కార్మికులు ఉపయోగించుకోవాలని కోరారు . ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఊపిరితిత్తుల , గుండె పనితీరు మరియు వ్యాధిని ముందుగానే కనిపెట్టవచ్చు అని అన్నారు . ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు . షుగర్ , థైరాయిడ్ , విటమిన్ డి , ఊపిరి తిత్తులు , కిడ్నీ , లివర్ , గుండె , బ్లడ్ గ్రూపింగ్ , క్యాన్సర్ , ఎలర్జీ వీటితోపాటు 54 రకాల పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు . ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి అమాలి సంఘం పట్టణ అధ్యక్షులు కలవెల్లి వీరభద్రం , ఎల్లయ్య , గురవయ్య , బాబు , నాగేశ్వ రావు , రాంప్రసాద్ , క్యాంపు కోటేటర్ అశోక్ కుమార్ , గోపి , పద్మ , ప్రసన్న , సీమ , శ్రీలత , రిజ్వాన , లావణ్య , మాధవి , ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు .