ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు 

Nov 20, 2025 - 13:32
 0  10
ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు 

అడ్డగూడూరు 19 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగొట్టి జోజి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఇందిరాగాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేశారు, గరీబియా అటావో నినాదంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని, బ్యాంకుల జాతీయకరణ,పేదలకు భూ పంపిణీ కార్య క్రమాలను చేపట్టి ఉక్కు మహిళగా కీర్తి ఉందని అన్నారు.అనంతరం  మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  మండల కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్, వల్లంబట్ల రవీందర్ రావు , పాశం సత్యనారాయణ, బొమ్మగాని లక్ష్మయ్య, గూడెపు పాండు, రాచకొండ రమేష్, కడారి రమేష్, తోట మదన్మోహన్, గూడెల్లి యాదయ్య, మందుల లక్ష్మయ్య, వరికుప్పల ఇద్దయ్య ,మందుల సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333