వాట్సాప్‌తోనే మీ-సేవ 580 పనులు అందుబాటులోకి తెలంగాణ ప్రభుత్వం 

Nov 20, 2025 - 13:33
 0  5
వాట్సాప్‌తోనే మీ-సేవ 580 పనులు అందుబాటులోకి తెలంగాణ ప్రభుత్వం 

అడ్డగూడూరు 20 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు ముందుకు వేసింది.మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ద్వారా(మీసేవ)ను అధికారికంగా ప్రారంభించారు.దీంతో ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా,కేవలం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపితే సరిపోతుంది.580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.ఇది దేశంలోనే అత్యంత పెద్ద డిజిటల్ సేవల ఇంటిగ్రేషన్‌గా భావిస్తున్నారు. ఇన్‌కం సర్టిఫికేట్,బర్త్ సర్టిఫికేట్,క్యాస్ట్ సర్టిఫికేట్,డెత్ సర్టిఫికేట్,విద్యుత్ బిల్లుల చెల్లింపు నీటి బిల్లులు,ఆస్తి పన్నులు ప్రజలు రోజూ ఉపయోగించే దాదాపు అన్ని సర్వీసులు ఇప్పుడు ఒకే ప్లాట్‌ ఫారమ్‌లో లభ్యమవుతున్నాయి.
ప్రజలు సేవలను ఎలా పొందాలి?సేవలను పొందడం చాలా సులభం వాట్సప్ 80969 58096_ఈ నంబర్‌కు"హి"అని పంపాలి.ఆటోమేటిక్ మెను వస్తుంది.కావలసిన సేవను సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేయొచ్చు.ఈ ప్రక్రియ పూర్తిగా సులభమైనది, వేగవంతమైనది, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకారి.ఈ కొత్త ఫీచర్‌తో సేవలలో పారదర్శకత,వేగం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.పౌరులు ఎక్కడ ఉన్నా,ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వ సేవలను(మీసేవతో)తక్షణం పొందగలరు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333