కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

Jan 17, 2025 - 18:52
 0  13
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి 17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవంగర మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ షాధిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని 40మంది లబ్ధిదారులకు మంజూరు అయిన  40,04,640 రూ, లను పంపిణీ చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ..పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవని, వీటిని ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. పేదలు, రైతులు, వృద్ధులు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333